పిచాయ్‌కి 2500 కోట్ల నజరానా - MicTv.in - Telugu News
mictv telugu

పిచాయ్‌కి 2500 కోట్ల నజరానా

April 23, 2018

2016 కు గాను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు అక్షరాల 380 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 2,524 కోట్ల) రివార్డు రానుంది. 2014లో గూగుల్‌లో తనకు లభించిన ప్రమోషన్‌కు ప్రతిఫలంగా 3,53,939 వాటాలు (రిస్ట్రిక్టెడ్‌ షేర్స్‌) బుధవారం విడుదల కానున్నాయి. దీంతో ఈ మొత్తం వాటాల విలువ ఆయనకు దక్కనుందని బ్లూమ్‌బర్గ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఈ రివార్డుతో సుందర్ పిచయ్ పంట పండినట్టే అయింది. ఇంత భారీ స్థాయిలో ఇంత వరకు ఏ కంపెనీ కూడా రివార్డు ఇవ్వకపోవటం గమనార్హం.

ఆల్ఫాబెట్‌ కంపెనీ నేతృత్వంలోని గూగుల్‌ కంపెనీకి సుందర్‌ పిచాయ్‌ (45) 2015 నుంచి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది తిరగగానే సుందర్ కంపెనీ నుంచి భారీ మొత్తంలో రివార్డు అందుకోవటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు ఏడాది సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందినందుకు ప్రతిఫలంగా ఈ షేర్లను కంపెనీ ఆయనకు కట్టబెట్టింది. దీంతోపాటు గూగుల్‌ ఫౌండర్‌ ల్యారీ పేజ్‌ బాధ్యతలు కూడా చాలామటుకు ఆయనకు బదలాయించారు. ఆయనకు వాటాలు బదలాయించిన తర్వాత వాటి విలువ 90శాతం మేరకు పెరిగింది. ఇదిలా వుండగా మరి 2017 కు ఆయనకు ఏ స్థాయిలో వాటాలు కట్టబెడుతుందోనని చూడాలి అంటున్నారు.