షారూక్ కు 28 మిలియన్ల ఫాలోవర్లా ? - MicTv.in - Telugu News
mictv telugu

షారూక్ కు 28 మిలియన్ల ఫాలోవర్లా ?

September 14, 2017

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు ట్విట్టర్లో 28 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఈ లెక్కతో షారుక్ ఖాన్ రేంజ్ మరింత పెరిగిపోయింది. వర్సగా రయీస్, జబ్ హర్రీ మెట్ సెజాల్ సినిమాలు ఫ్లాప్ అయినా తనకు ట్విట్టర్లో ఈ రేంజ్ ఫాలోవర్లు వుండటం నాటే జోక్ అంటున్నారు అతని ఫ్యాన్స్. బాలీవుడ్ ఖాన్ త్రయంలో షారూకే అత్యధిక ఫాలోవర్లను కలిగున్నాడని తేటతెల్లమైంది. 29.3 మిలియన్ ఫాలోవర్లను కలిగున్న అమితాబ్ ను కూడా బీట్ చేసేట్టున్నాడంటున్నారు. ఇక సల్మాన్ ఖానేమో 25.6, అమీర్ ఖాన్ 21.9, అక్షయ్ కుమార్ 20.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగున్నారు. వాళ్ళను దాటిపోయాడు షారూక్. 1980 లో టీవి రంగంలోకి వచ్చి నెమ్మదిగా పన్నెండేళ్ళకు 1992 లో ‘ దీవానా ’ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసాడు. డర్, బాజీగర్, అంజాన్ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేసి ప్రేక్షకులకు చాలా దగ్గరైన ఎక్సెలెంట్ నటుడు షారూక్ ఖాన్. బాలీవుడ్ లో డౌన్ టు ఎర్త్ వంటి ఎన్నో మైలురాళ్ళను దాటుకొచ్చిన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు ఇంత మంది ఫాలోవర్లు వుండటం ఆశ్చర్యమే !

https://twitter.com/iamsrk/followers