30 కిలోల లెహెంగాతో 66 సార్లు తిరిగింది - MicTv.in - Telugu News
mictv telugu

30 కిలోల లెహెంగాతో 66 సార్లు తిరిగింది

October 30, 2017

పద్మావతి’ సినిమాలోని ఒక్కో ప్రత్యేకత, రోజుకొకటి బయట పడుతోంది. ఈసినిమాలోని ‘గూమర్’ పాట ఇప్పటికే య్యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో దీపికా సాంప్రదాయ రాజ్‌పుటానా డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. అయితే ఈపాటలో ఆమె ధరించిన లెహంగా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. దాని ధర అక్షరాల 30 లక్షల పైనా ఉంటుందట.

30 కిలోల బరువున్న లెహంగాతో ‘గూమర్’ పాటలో దీపికా 66 సార్లు గుండ్రంగా తిరిగింది. ఈపాట ప్రత్యేకతను, పాట చేస్తున్నప్పుడు తన అనుభవాలను దీపికా తన ట్విటర్లో పంచుకుంది. ఆ దుస్తులు వేసుకోగానే తనలోకి పద్మావతి ప్రవేశించిన అనుభూతి కలిగిందని దీపికా చెప్పుకొచ్చింది. ఇన్ని ప్రత్యేకతలున్న పద్మావతి సినిమా డిసెంబర్1 న విడుదల కానుంది.