మోదీ సొంత రాష్ట్రానికి రైల్వే వర్సిటీ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ సొంత రాష్ట్రానికి రైల్వే వర్సిటీ

February 1, 2018

మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన 2018 బడ్జెట్లో రైల్వే  భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో ప్రకటించిన బడ్జెట్లో రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. రైలు ప్రయాణికుల భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ బడ్జెట్‌లో భాగంగా రైల్వే శాఖకు కేటాయింపులు చేశారు.

అన్ని రైల్వే జోన్‌లు, రైళ్లలో సీసీ టీవీలు, వైఫై సౌకర్యం, పెరంబూర్‌లో అధునాతన కోచ్‌ల నిర్మాణం జరిగేలా బడ్జెట్ కేటాయించామని పేర్కొన్నారు. రైలు పట్టాల నిర్వహణకు పెద్ద పీట వేస్తున్నట్టు, 4వేలకు పైగా కాపలాదారులు లేని గేట్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

కాగా, ప్రతిష్టాత్మకమైన రైల్వే యూనివర్సిటీ(నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ యూనివర్సిటీ)  ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

రైల్వేపై బడ్జెట్ కేటాయింపులు

 • రూ.1,48,000 కోట్లు రైల్వేకు కేటాయింపు
 • రైల్వే లైన్‌ల పునరుద్ధరణ (36 వేల కిలో మీటర్ల మేర)
 • కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160 కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌, రైళ్ల ఆధునీకరణకు ముందడుగు.
 • 4 వేల కిలో మీటర్ల  కొత్తగా రైల్వే మార్గం
 • 18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
 • అన్ని రైల్లే స్టేషన్లలో సీసీటీవీ, వైఫై ఏర్పాటు
 • దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి సౌకర్యాలు
 • 25 వేలమంది ప్రయాణికులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
 • ముంబయిలో అర్బన్‌ రైల్వే వ్యవస్థ ఆధునికీకరణకు రూ.లక్ష కోట్లు.
 • 4200 మానవరహిత రైల్వే లెవెల్ క్రాసింగ్ ల తొలగింపు.
 • ముంబై లోకల్ రైళ్ల కోసం 90 కి.మీ. మేర డబుల్ లైన్.
 • ముంబై సబర్బన్ రైల్వేకు రూ. 17 వేల కోట్లు.
 • బెంగళూరు మెట్రోకు రూ. 17 వేల కోట్లు.
 • రైల్వే భద్రతలో భాగంగా ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు పెద్దపీట.