“సైరా” స్క్రిప్ట్ తో సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నడో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

“సైరా” స్క్రిప్ట్ తో సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నడో తెలుసా?

December 5, 2017

చిరంజీవి 151 వ సినిమా సైరా నర్సింహారెడ్డి డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏమాత్రం రిస్క్ తీసుకుంటలేడు.250 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న సైరా కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నడు. రాంచరణ్ సినిమాకు అచ్చొచ్చిన సెంటిమెంట్ నే చిరంజీవికి విషయంలోనూ ఫాలో అవుతున్నడు.

అందుకే రేపు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లికి పోతున్నడు. ఊళ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిల పొద్దున 5 గంటలకు సైరా స్క్రిప్ట్ కు పూజ చేపిస్తున్నడు. ధృవ సినిమా స్క్రిప్ట్ కు కూడా ఇదే గుడిల పూజ చేయించిన సురేందర్ రెడ్డి, బంపర్ హిట్ కొట్టిండు. సైరా విషయంలోనూ అదే రిజల్ట్ రిపీట్ కావాలనుకుంటున్నడు సురేందర్.  

సురేందర్ నమ్మకం మరోసారి నిజం కావాలని, సైరా సూపర్ డూపర్ హిట్ కావాలని మైక్ టీవీ కోరుకుంటుంది.