‘ పద్మావతి’కి 400 కేజీల బంగారం


సంజయ్‌లీలా బన్సాలీ సినిమాలు ఎంత వైవిధ్యంగా, భారీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల క్రితం విడుదలైన ‘పద్మావతి’ ట్రైలర్ రెండు కోట్ల డెబ్బై లక్షల వ్యూస్ రికార్డ్‌తో దూసుకెళ్తుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే అలియాస్ ‘పద్మావతి’ ధరించిన నగలను తనిష్క్ జ్యూవెలర్స్ సంస్థ ప్రత్యేకంగా తయారుచేసింది. దాదాపు 400 కిలోల బంగారంతో 13వ శతాబ్ధానికి చెందిన రాజ్‌పుత్ రాణులు వేసుకున్న గోల్డెన్ డైమండ్, ఆర్నమెంట్స్ ఎలా ఉండేవో.. అచ్చం అలానే తనిష్క్ తయారు చేసింది. సుమారు 200 మంది జువెల్లరీ డిజైనర్లు ఈ ఫిల్మ్‌ కోసం వర్క్ చేశారు. 400 కిలోల బంగారాన్ని, ఆకర్షణీయమైన ఆభరణాలుగా మార్చేందుకు, 600 రోజులు పట్టిందట.  ఆ బంగారం విలువ రూ. 120 కోట్లు. ఆ ఆభరణాల తయారీ వీడియోను తనిష్క్ రిలీజ్ చేసింది. పద్మావతి ఫిల్మ్‌లో రాణి పద్మిని పాత్రలో దీపిక, రావల్ రతన్ సింగ్‌గా షాహిద్‌కపూర్, అల్లావుద్దిన్ ఖిల్జీగా రణ్‌వీర్ నటిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత క్రేజ్ ను సంపాదిస్తున్న ‘పద్మావతి’ సినిమా, విడుదల తర్వాత ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చెయ్యబోతుందో మరి.

SHARE