mictv telugu

నగరానికి పండగ.. నుమాయిష్ చరిత్ర, విశేషాలు..

January 10, 2019

ఊర్లలో అయితే ఏదో ఒక పండగ సందర్భాన్ని పురస్కరించుకుని జాతర్లు జరుపుతారు. కానీ హైదరాబాద్ నగరంలో అలా వీలు కాదు. అందుకే నగర పౌరుల కోసం ప్రతిసారి నుమాయిష్(ఎగ్జిబిషన్) జరుగుతుంది. రెండు కళ్ళు సరిపోవు నుమాయిష్ సందడిని చూడటానికి. ఇది కేవలం హైదరాబాద్ వాళ్ళ కోసమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తారు. సందర్శకులతో ఇసుకవేస్తే రాలనంత సందడి నెలకొంటొంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజులపాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. ప్రారంభం నాడు ముఖ్యమంత్రి  ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

Telugu news 46-days numaish festival to the city residents

ప్రతి రోజు మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు వుంటుంది(మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 10:30 వరకు).పారిశ్రామిక ప్రదర్శనను హైదరాబాదు ఎగ్జిబిషన్ (నుమాయిష్) లేదా అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల (All India Industrial Exhibition)గా కూడా వ్యవహరిస్తారు. ఈ పారిశ్రామిక ప్రదర్శన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా వినియోగదారులను ఇది చైతన్యవంతం చేస్తుంది.

BK7A2395

 

నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ (ముకర్రంజాహి రోడ్) ఈ ఉత్సవానికి వేదకగా మారుతోంది. బొమ్మలు, బట్టలు, పిల్లలకు ఆడుకునే వస్తువులు, ఇంటి సామాగ్రి, సర్కస్, ఐస్ క్రీంలు, సంగీత కచేరి, బుల్లెట్ రైడ్, ట్రెయిన్ ప్రయాణం.., ఇలా ఎన్నో వుంటాయి.  చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తారు. ఈ ప్రదర్శనశాలలో కేవలం పారిశ్రామిక వస్తువులే కాకుండా పలు రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అందుకే ఏడాదికొకసారి వచ్చే నుమాయిష్ కోసం నగరవాసులు ఎదురుచూస్తుంటారు. చాలా సందడిగా, కోలాహలంగా సాగుతుంది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు సంపాదించింది.

BK7A2307

1937లో కేవలం 100 స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన శాలలో ప్రస్తుతం 2,600 స్టాల్స్‌ వుంటున్నాయి. నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి. లోపల అన్నీ సౌకర్యాలు వుంటాయి. మహిళలు, పురుషుల సౌకర్యార్థం టాయిలెట్స్ కూడా వుంటాయి.పలు రకాలైన తినుభండారాలు కూడా ప్రదర్శనశాల లోపల లభిస్తాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శన స్థలం వరకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రదర్శనా మైదానంలో స్టాల్స్‌ల కేటాయింపు, సందర్శకులకు సౌకర్యాలు మొదలగు నిర్వహణా కార్యకలాపాలను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ సొసైటీకి నగరంలోని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖ, ట్రాఫిల్ పోలీస్ శాఖ మొదలగు శాఖలు సహకరిస్తాయి.

BK7A2384

నుమాయిష్ వల్ల ఆదాయంతో సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనేక కళాశాలలు కూడా ఈ సొసైటీ విరాళాలతో నిర్వహించబడటం విశేషం. పెద్దలకు రూ.30 టికెట్ వుంటుంది. సీనియర్ సిటిజన్స్‌కు, పిల్లలకు ప్రవేశం ఉచితంగా పెడుతున్నారు.

Telugu news 46-days numaish festival to the city residents