mictv telugu

ఢిల్లీలో ధనాధన్.. పాత నేరస్తుల కాల్చివేత..

February 11, 2019

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం నేరస్థులకు, పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమయ్యారు. రోహిణి సెక్టార్ 10 లోని జయంతి పార్కు వద్ద నీరజ్ బావనా గ్యాంగ్‌కు చెందిన నేరగాళ్లు దాడి చేసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నేరగాళ్లకు జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన గ్యాంగ్‌స్టర్లను హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

Telugu News 5 Men Wanted In Murder Cases Caught By Delhi Police After Shootout.

ఈ ఎన్’కౌంటర్‌లో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు బుల్లెట్లు తగిలినా, వారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించడంతో ప్రమాదం తప్పిందని డీసీపీ సంజీవ్ యాదవ్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తరువాత ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో దోపిడీ దొంగలైన అర్పిత్ ఛిత్లార్, సునీల్ భూరా, సుఖ్విందర్ లు గాయపడ్డారని డీసీపీ వివరించారు. సంఘటన స్థలంలో పోలీసులు గన్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు ఇదివరకే వీరు హత్య కేసులో నిందితులని పోలీసులు నిర్దారించారు.Telugu News 5 Men Wanted In Murder Cases Caught By Delhi Police After Shootout