ప్లీజ్ రా.. మారండి రా..పసిమొగ్గలు ఏం పాపం చేశాయి రా? - MicTv.in - Telugu News
mictv telugu

ప్లీజ్ రా.. మారండి రా..పసిమొగ్గలు ఏం పాపం చేశాయి రా?

December 13, 2017

ఇలాంటి వార్తలను మేము ఎంత వద్దనుకున్నా, రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. మనసొప్పకపోయినా చెప్పడం మాబాధ్యత గనక చెబుతున్నాం. నిజంగా మనుష్యులు ఇలా ఎందుకు తయారవుతున్నారు? రోజు రోజుకీ విచక్షణ కోల్పోయి మరీ పాతాళా అంచులకు ఎందుకు దిగజారుతున్నారు? పది సంవత్సరాలు కూడా దాటని పసి పాపల నవ్వుల్ని చూసి, ఆనందం వెతుక్కోవాల్సిన మనుష్యుల కళ్లు…ఆ చిన్నారులను కామవాంఛతో ఎలా చూడగలుగుతున్నాయి? వాళ్ల ముద్దు ముద్దు మాటల్ని విని ఆనంద అనుభూతిని పొందాల్సిన మనస్సు..ఆచిట్టి తల్లులను అనుభవించాలనే నీచ నికృష్ఠ కోరికకు ఎలా బానిసవుతోంది.

రంగారెడ్డిజిల్లా  నార్సింగిలో మధ్యప్రదేశ్ కు చెందిన దినేష్ అనే ఓ యువకుడు బీహార్‌కు చెందిన 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి, ఆతర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. చ రాయడానికే  నీచమనిపించే ఈ చర్యను వాడు ఎలా చేయగలిగాడు? మనుష్యులు ఇంత మృగాళ్లుగా ఎందుకు తయారవుతున్నారు? పోలీసులు ఆ కామాంధున్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదొక్కటే కాదు మొన్న హరియాణాలో కొందరు దుర్మార్గులు 5 సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసి , ఆమె మర్మాంగాలలో 16 సెంమీల చెక్కను కుక్కారు. మీ కామవాంఛ తీరేందుకు ఎందుకురా పసిమొగ్గలను మొగ్గలోనే చిదిమేస్తున్నారు. అసలు మీకు ఆ ఆలోచన ఎలా వస్తుందిరా? మీ కామవాంఛను ప్రేరేపించేలా వాళ్లు ఏం చేశార్రా. అభం శుభం తెలియని, లోకం పోకడ తెలియని పసి పాపల మీద మృగాళ్లలా ఎలా ప్రవర్తించగలుగుతున్నారా? మీ అకృత్యాలకు వారు ఏడ్చే ఏడుపు కూడా మీ మనసును తాకుతలేదంటే.. మీ మనసులు ఎందుకురా బండరాయి కంటే అద్వానంగా తయారయ్యాయి. ఒక్కసారి మీరు చిదిమేసిన నవ్వులను గుర్తు చేసుకోండిరా, అప్పుడైనా సిగ్గస్తుందేమో?

అసలు వీళ్లు ఇలా తయారు కావడానికి అసలు కారణాలు ఏంటి? విచక్షణ కోల్పోయి పశువుల్లా పసిపాపల మీద ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు? అభివృద్ది చెందుతున్న టెక్నాలజీయే దీనికి కారణమా? మనుష్యుల మధ్య అంతరించిపోతున్న ప్రేమ అనురాగాలు వారిలో లేకపోవడమే కారణమా? ఇది తప్పురా ఇది ఒప్పురా అని సమాజం వాళ్లకు హితబోద చెయ్యకపోవడమే కారణమా?

ఇలాంటి వాళ్లను ఏం చేస్తే, ఇంకొకరు ఇలాంటి తప్పు చెయ్యకుండా ఉంటారు. ఇలాంటి మృగాళ్ల నుంచి పసి పాపలను ఎలా కాపాడుకోవాలి? వీళ్ల ఆలోచనల్లో మార్పు రావాలంటే  ఎలాంటి చర్యలు తీసుకోవాలి. చిన్నారులను కూడా సెక్స్ థోరణిలో చూసే నీచ నికృష్టులకు ఎలా బుద్ది చెప్పాలి ?

మారండిరొరేయ్  తల్లికి, చెల్లికి బిడ్డకు భార్యకు తేడా తెలవని యెదవల్లారా మారండి, మారి మాలోనూ ఓ మనిషి దాగున్నాడని నిరూపించుకోండి. సమాజంలో మహాత్ములుగా బ్రతక్కపోయినా  కనీసం మనష్యులుగా బ్రతకండి.