డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు 51 వేలు 

‘షాదీ ముబారక్’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం యువతుల పెళ్లికానుకగా 75,116 రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పెళ్లికాని ముస్లిం యువతుల కోసం ‘షాదీ శగున్’ అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం యువతులకు రూ.51 వేల రూపాయలు కానుకగా అందించనుంది. మైనారిటీలలో ఉన్నత చదువులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుంది. బేగమ్ హజ్రత్ మహల్ అంటే ‘మౌలానా ఆజాద్ ఫౌండేషన్’ అందించే స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించినవాళ్లంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ‘షాదీ శగున్’ పథకం వివరాలను ‘మౌలానా ఆజాద్ ఫౌండేషన్’ తమ వెబ్‌సైట్‌లో ఉంచనుంది. ఆడపిల్లల పెళ్లి కోసం డబ్బు దాచి వాళ్లను చదువులను మధ్యలోనే ఆపేయొద్దనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్లు మైనారిటీ శాఖ తెలిపింది.

SHARE