రేప్ చేయడానికి  580 కి.మీ. దూరం నుంచి.. - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేయడానికి  580 కి.మీ. దూరం నుంచి..

April 12, 2018

కండ కావరంతో కళ్ళు మూసుకుపోయిన నరరూపరాక్షసులు ఉన్న సమాజంలో ఆడపిల్ల మనుగడ నానాటికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎంతకాలం ఇలా ? ఎంతమంది ఇలా అభం శుభం తెలియని పసివాళ్ళను సైతం చిదిమేస్తారు ? కొన్ని నెలల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన జమ్మూకాశ్మీర్ కతువా అత్మాచార ఘటనలో ఒళ్ళు జలదరించే సంచలన నిజాలు బయటకు వచ్చాయి.ఈ ఘటనలో పోలీసులు 15 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తూ, అందులో విస్తుపోయే నిజాలను పొందుపరిచారు. గత జనవరిలో 8 సంవత్సరాల బాలికపై కొందరు కళ్ళు మూసుకుపోయిన కామాంధులు అత్యాచారం చేసి చంపిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు నిందితులు నిత్యం బాలికకు మత్తులోనే వుంచి అత్యాచారం చేశారని తెలిపారు. ఓ ప్రార్థనా మందిరంలో వుంచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఐదుగురు అదే ప్రాంతానికి చెందినవారు. మరో నీచుడు బాలికను అత్యాచారం చేయటానికి యూపీలోని  మీరట్ నుంచి వచ్చాడు. 580 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.

ప్రార్థనా మందిరంలో.. వారం రోజులు ఘోరంగా..

ప్రార్థనా మందిరం కేర్ టేకర్‌గా ఉన్న సంజీ అనే వ్యక్తి మొత్తం నేరానికి బాధ్యుడని పోలీసులు తెలిపారు. అత్యాచార నిందితుల్లో సంజీతో పాటు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, వారి స్నేాహితులు పర్వేష్ కుమార్, సంజీ మేనల్లుడు, సంజీ కుమారుడు కూడా నిందితులేనని పేర్కొన్నారు. బాలికను చంపేసే ముందు కూడా అత్యాచారం చేసి, బండరాయితో మోది చంపారని తెలిపారు. బాలిక మృతదేహాన్ని అడవుల్లో పారేసింది ఈ కేసులో మైనర్ అయిన సంజీ మేనల్లుడు.

కాగా ఈ కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు, విచారణను దారి మళ్ళించేందుకు పోలీసుల పాత్ర కూడా వుందని పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుళ్లు తిలక్ రాజ్, ఎస్ఐ ఆనంద్ దుత్తాలు రూ. 4 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఈ కేసులో భాగస్వామ్యమైన అందరికీ కఠిన శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు. ఈ ఘటనను ఓ ప్రణాళిక ప్రకారం నిందితులు జరిపారని, కతువా సమీపంలోని రాసన్నా ప్రాంతంలో నివసించే భకేర్వాల్ వర్గాన్ని తీవ్ర భయకంపితులను చేయడమే వారి ఉద్దేశమని కశ్మీర్ పోలీసులు తమ చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.