mictv telugu

కోడలిపై కన్నేసిన మామ.. కొడుకును ముక్కలుగా నరికి..

February 14, 2019

కొడుకు కాపురం చక్కదిద్దాల్సిన తండ్రే.. తప్పుడు పనిచేశాడు. కోడలిపై కన్నేసి, అడ్డుగా ఉన్న కొడుకును కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలుముక్కలుగా నరికి బ్యాగుల్లో వేశాడు. అతి దారుణమైన ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.Telugu News 62 Year Old Punjab Man Kills Son, Cuts Body Into Pieces ‘To Marry’ Daughter In lawఫరీద్‌కోట్‌‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడు చోటా‌సింగ్.. అతని కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తరచూ 40ఏళ్ల కొడుకు రజ్విందర్‌సింగ్‌తో గొడవ పడుతుండేవాడు. ఎలాగైన కొడుకును చంపి, కోడలిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లుగానే కొడుకు రజ్విందర్ సింగ్‌ నిద్రపోతున్న సమయంలో కత్తితో పొడిచి చంపేశాడు. అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి, ఇంట్లోని బ్యాగుల్లో వేశాడు.

చోటా‌సింగ్ సమీప బంధువు ఒకరు ఇంటికి వచ్చింది, ఇంట్లో ఆమెకు రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోటాసింగ్‌ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో బాధితుడి భార్య హస్తం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.