చెత్తలో రూ.64 లక్షల బంగారం ! - MicTv.in - Telugu News
mictv telugu

చెత్తలో రూ.64 లక్షల బంగారం !

March 16, 2018

ఏమిటి రూ. 64 లక్షల బంగారం చెత్తలో దొరికిందా? ఎక్కడ?  ఎవరికి? అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది కదా? అవును దొరికింది  కానీ దొరికింది ఎవరికో కాదు బంగారం పోగుట్టుకున్న ఆమెకే తిరిగి దొరికింది.  జార్జియాలో ఈ ఘటన జరిగింది. ఓ గృహిణి నలుపు రంగు కవరులో వజ్రాల ఉంగరాలు ,బ్రేస్‌లెట్ పెట్టింది. అయితే  చెత్త తీసుకెళ్లే వారు వచ్చినప్పుడు పొరపాటున ఆ బంగారం ఉన్న కవర్ను కూడా చెత్త అనుకుని అందులో పారేసింది.

ఆ తర్వాత  నగల కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. తీరా నల్ల కవరులో పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే చెత్తను జమచేసే కార్మికుల దగ్గరకు వెళ్లి  దయచేసి నా నగలు బ్యాగు చెత్తలో పడింది అని చెప్పగానే కార్మికులు 10 టన్నుల చెత్తలో మూడు గంటల పాటు వెతకగా చివరకు ఆమె బంగారం బ్యాగు కనబడింది. హమ్మయ్య అని  అమె అప్పడు ఊపిరి పీల్చుకుంది. ఆ బంగారం విలువు లక్ష డాలర్లు (రూ.64లక్షలు). ఇంకా నయ్యం కార్మికులు ఆ బంగారాన్ని ముందే గుర్తిస్తే…ఆమెకు ఉత్త బ్యాగే మిగులుతుండె గావచ్చు