65వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ - MicTv.in - Telugu News
mictv telugu

65వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ

April 13, 2018

‘ ఘాజీ ’ సినిమా జాతీయ స్థాయిలో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే అవార్డుల్లో ఘాజీ సినిమా ఓ అవార్డు గెలుచుకుంది.  65వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. ఇందులో దివంగత నటి శ్రీదేవి నటించిన ‘ మామ్‌ ’ సినిమాతో పాటు రాణా నటించిన ‘ఘాజీ’ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.  సంకల్స్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే టాలీవుడ్ విజువల్‌ వండర్‌ ‘బాహుబలి2’ సినిమాకు అవార్డుల పంట పండింది. ఏఆర్. రెహ్‌మాన్‌కు మామ్ సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీతానికి అవార్డ్ వచ్చింది. ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి 2 కు మూడు అవార్డులు లభించాయి.  ఇదిలా వుండగా తెలుగులో మొదటిసారిగా సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఘాజీ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో ఎంపికై తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టుకు తీసుకు వెళ్ళిందనే చెప్పొచ్చు.

అవార్డుల వివరాలు :

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ : వినోద్‌ ఖన్నా

నర్గీస్ దత్ అవార్డు (జాతీయ సమైక్యతా చిత్రం)- దప్పా(మరాఠీ)

ఉత్తమ చిత్రం : విలేజ్‌ రాక్‌స్టార్స్‌ (అస్సామీ)

హిందీ ఉత్తమ చిత్రం : న్యూటన్‌

ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ

జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవీ (మామ్‌)

జాతీయ ఉత్తమ నటుడు : రిద్ది సేన్ (మామ్)

ఉత్తమ దర్శకుడు : జయరాజ్‌ (భయానకమ్‌)

ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రం : బాహుబలి2

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు : బాహుబలి2

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి2

ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్‌ ఆచార్య (టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ)

ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై)

ఉత్తమ నేపథ్య సంగీతం : ఎఆర్ రెహ్మాన్( మామ్‌)

ఉత్తమ గాయకుడు : జేసుదాసు

ఉత్తమ గాయని : షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్‌ వరువన్‌ )

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ -టేకాఫ్ (మలయాళం)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- బనితా దాస్(విలేజ్ రాక్ స్టార్స్)