mictv telugu

ఆమెకు 24, అతనికి 67.. పెళ్లిపై రచ్చరచ్చ..

February 8, 2019

ప్రేమ నిజంగానే గుడ్డిదేమో.. కానీ పెళ్లి గుడ్డిది కాదు కదా. పెళ్లి అనగానే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడకపోయినా కనీసం, ఈడూజోడూ అయినా చూసుకోవాలి కదా. అదేంటో తెలియదు కానీ కొందరు అవేవీ చూసుకోకుండా గంతకు తగ్గ బొంతలా ముడిపడిపోతుంటారు. ఈ జంట కూడా అలాంటిదే. ఈ జంటకు వారిద్దరి మధ్య 43 ఏళ్ల వయసు వ్యత్యాసం వుంది. అతనికి మనవరాలి వయసుంది ఆమె. అయినా వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

Telugu news, 67 yr old Shamsher Singh, 24 yr old Navpreet Kaur get married in Punjab,ask police protection

పంజాబ్‌లో జరిగింది వీరి వివాహం.  67 ఏళ్ల శంషేర్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల 24 ఏళ్ల నవప్రీత్ కౌర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. జనవరిలో  చండీగఢ్‌లోని గురుద్వారాలో వీరి వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహమో కాదో తెలియదు గానీ వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లి విషయం తెలిసిన ఇరు కుటుంబాల వాళ్ల నుంచి తీవ్ర విముఖత ఎదురవుతోంది. ఇద్దరికీ  బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరు తమకు ప్రాణహాని వుందని, తమకు భద్రత కల్పించాలంటూ పంజాబ్ చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు. వారికి లాయర్లు కూడా మద్దతు పలికారు.

ఈ పెళ్లి వారిద్దరి అంగీకారంతోనే జరిగిందని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఆ దంపతులిద్దరికీ కోర్టు పోలీసు భద్రత కల్పించింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. ఇదిలావుండగా ఈ వ్యవహారంపై వారిద్దరు ఇంతవరకు మీడియా ముందుకువచ్చి మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. Telugu news, 67 yr old Shamsher Singh, 24 yr old Navpreet Kaur get married in Punjab,ask police protection