దీని ధర కేవలం రూపాయి తక్క ఏడు లక్షలే.. - MicTv.in - Telugu News
mictv telugu

దీని ధర కేవలం రూపాయి తక్క ఏడు లక్షలే..

December 16, 2017

మీరు ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే దీనివైపు ఓలుక్కేయండి. ధర ఎంతని అనుకుంటున్నారా? ఎంతంటే కేవలం రూ.6,99,999 రూపాయలే. అబ్బో ల్యాప్ టాప్ కు ఏడు లక్షలా? అని అవాక్కవుతున్నారు కదా? ఇందులో ఉన్న ప్రత్యేకతలు అలాంటివి మరి. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ యేసర్ ‘ప్రిడేటర్‌ 21 ఎక్స్‌’ పేరుపై కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఫిప్ కార్ట్,యేసర్ స్టోర్లలో ఈ ల్యాప్ టాప్‌లు డిసెంబర్ 18 నుంచి అందుబాటులో ఉంటాయి. ఐ ట్రాకింగ్‌ టెక్నాలజీ, వంపులు తిరిగిన స్క్రీన్‌తో వస్తున్న తొలి నోట్‌ బుక్‌ అని యేసర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 ల్యాప్ టాప్ లను మాత్రం అమ్ముతున్నట్లు యేసర్ స్పష్టం చేసింది.

ఏడు లక్షల ల్యాప్ టాప్..ప్రత్యేకతలు ఇవే

* 21 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే

* 2560× 1080 రిజల్యూషన్‌

* జీటీఎక్స్‌ 1080 గ్రాఫిక్‌ కార్డ్‌

* 7వ తరం ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌

* 64జీబీ డీడీఆర్‌ 4 ర్యామ్‌

* 512 జీబీ గల నాలుగు డ్రైవ్‌లు

* 8.5 కిలోగ్రాముల బరువు