మన్మరాలు వయసుండే  బాలికను గర్భవతిని చేశాడు..వీన్నేం చేయాలె? - MicTv.in - Telugu News
mictv telugu

మన్మరాలు వయసుండే  బాలికను గర్భవతిని చేశాడు..వీన్నేం చేయాలె?

March 2, 2018

మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి కామంతో కళ్లు మూసుకుపోయిన 76 ఏళ్ల వృద్దుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో గర్భవతి అని తేలి విషయం బయట పడింది.

హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ వాహబ్(76) సౌదీలో ఉద్యోగం చేసి కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఇతనికి  5 గురు కూతుర్లు  ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు కావడంతో ఎవరి ఇండ్లలో వారు ఉంటున్నారు. మూడేళ్ల క్రితం భార్య కూడా చనిపోయింది. అయితే ఒంటరిగా ఉంటున్న  ముసలోడి కన్ను ఎదురింట్లో ఉంటున్న  13ఏళ్ల బాలికపై పడింది.

చాకెట్లు బిస్కెట్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి  ఇంట్లొకి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటగాని ,నీ తల్లిదండ్రులకు గానీ చెప్పావో నిన్ను చంపేస్తా అని బాలికను బెదిరించాడు. బాలిక భయపడి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈక్రమంలో మొన్న బాలికకు కడుపులో తీవ్రంగా నొప్పి రావడంతో తల్లిదండ్రులు దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్ష చేసిన వైద్యులు గర్భవతి అని  చెప్పగానే  ఒక్కసారి ఆ తల్లిదండ్రులు షాకయ్యారు.

బాలికను అడుగగా ఏడూస్తూ ఎదిరింట్లో ఉండే ముసలోడి గురించి చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు  అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వృద్ధ కామాంధుడికి కఠిన శిక్ష విధించాలని నిర్భయ కేసు  వేయాలని  బాలిక కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.