అప్పుడలా.. ఇప్పుడిలా... - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడలా.. ఇప్పుడిలా…

November 21, 2017

1980లలో దక్షిణ భారత సినీ  ప్రేక్షకులను అలరించిన  సినీ తారలు అప్పుడప్పుడు ఒకే చోట కలుసుకుంటూ ఉంటారు. ‘80’s సౌత్ యాక్టర్స్ రీయూనియన్’ పేరుతో నిర్వహించే వేడుకల్లో అందరూ ఒకే రంగు దుస్తులు ధరించి సందడి చేస్తుంటారు.

తాజాగా నవంబర్ 17న మెుత్తం 28 మంది సినీ తారలు మహాబలిపురంలో ఎనిమిదో సారి కలుసుకున్నారు. అందరూ వంగపువ్వు రంగు దుస్తులు ధరించారు. రకరకాల్లో ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వేడుకల్లో భాగంగా ర్యాంప్ వాక్ కూడా ఏర్పాటు చేశారు. సంబరమంతా  చిరంజీవి  సమక్షంలో జరిగింది. చిరంజీవి, వెంకటేశ్, సురేశ్, భానుచందర్,శరత్‌కుమార్, నరేశ్, రెహమాన్, జయసుధ, రాధిక, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ ,సుమలత,నదియా,రాధ,  లిజీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.

‘80’s స్నేహితులతో లవ్లీ వికెండ్ ’ అంటూ రాధిక ఓ ఫోటోను ట్వీట్ చేశారు.