88 మంది బాలికలను బట్టలు విప్పించి.. - MicTv.in - Telugu News
mictv telugu

88 మంది బాలికలను బట్టలు విప్పించి..

November 30, 2017

పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పడం కన్నా వారిని దండించడంలో, హింసించడంలోనే  ఎక్కువ శ్రద్ధ కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో పనిష్మెంట్ పేరిట తోటి విద్యార్థుల ముందు 88 మంది విద్యార్థినుల దుస్తులు విప్పించారు ముగ్గురు ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఓ కాగితంలో అసభ్య వ్యాఖ్యలు రాశారని ఆరోపిస్తూ ఈ నెల 23న ఉపాధ్యాయులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పాపుమ్ పారే జిల్లా తాని హప్పలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరు, ఏడవ తరగతి తరగతి గదుల్లో ఈ దారుణం జరిగిది.బాధిత విద్యార్థినులు ఈనెల 27న ‘ ఆల్‌ సంగాలీ విద్యార్థి సంఘం ’ ( ఏఎస్‌ఎస్‌యూ )ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. యూనియన్‌తో కలిసి విద్యార్థినులు  పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.