ఒక “దావూద్” పశ్చాత్తాపం - MicTv.in - Telugu News
mictv telugu

ఒక “దావూద్” పశ్చాత్తాపం

February 20, 2018

కరాచీ బీచ్ ఒడ్డున నియాన్ బల్బుల వెలుగుల్లో ఎప్పుడూ జిగేల్ గా మెరిసే వైట్ హౌజ్ లో ఆ రోజెందుకే ఒక్క బల్బు కూడా వెలగడం లేదు. టెర్రస్ మీద మాత్రం చిన్నగా ఏదో వెలుగు. చేతిలో మొబైల్స్ తో ఇద్దరు మనుషులు. ఒకడు మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం. ఇంకొకడు బడేమియా. చిన్న టేబుల్ ముందు కూర్చోని ఉన్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు.

“తప్పు చేశాను భయ్యా”. గూగుల్ న్యూస్ ఫీడ్ ను బ్రౌజ్ చేస్తు దావూద్. తప్పు చేయకపోవడం తప్పు అని అనుకునేవాడు సడెన్ గా అంత పెద్ద మాట అనేసరికి బడేమియా ఒక్కసారిగా తలెత్తి పైకి చూశాడు.

ఆడుతున్న ఆన్ లైన్ రమ్మీ ని పక్కనబెట్టి, “అవును దావూద్. చాలా పెద్ద తప్పు చేశావ్” అని మళ్లా రమ్మీ  ఆడడం కంటిన్యూ చేశాడు బడేమియా.

“ఎవరైనా సలహా ఇచ్చి ఉంటే ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు” దావూద్ కళ్లు గూగుల్ ను జల్లెడ పడుతూనే ఉన్నాయి.  రమ్మీ గేమ్ నుంచి క్విట్ అయ్యాడు బడేమియా. పొద్దున్నే కొనుక్కున్న ఐ ఫోన్ ఎక్స్ ను  టేబుల్ మీద పెట్టి కుర్చీ కొంచెం ముందుకు జరుపుకున్నడు..

“నేను చెప్తూనే ఉన్నా. కాని నువ్వే నా మాట వినలేదు. ఛోటూ గాడిని ఆ ఇస్తెమాలకు పంపకపోయి ఉంటే ఇవాళ వాడు మౌల్వీలా మారకపోయేవాడు”. అని నిట్టూర్చాడు బడేమియా. అప్పుడే ఏదో జరిగింది. కాని ఏం జరిగిందో బడేమియా కు అర్థం కాలేదు. టేబుల్ మీద పెట్టిన తన ఐఫోన్ ఎక్స్ మాత్రం కనబడలేదు. కాళ్లకు ఏదో తాకడంతో కిందకు చూశాడు. తన ఫోనే. ముక్కలై ఉంది. అంతకుముందు మసక చీకట్లో కనిపించని సీన్ ను, ఫుల్ హెచ్. డీలో  అదీ స్లో మోషన్ లో ఇమాజిన్ చేసుకున్నాడు బడేమియా.

“అంటే నువ్వు మాట్లాడుతున్నది మన మొయిన్ గురించి కాదా” క్లారిటీ కోసం అడిగాడు బడేమియా.

కూర్చున్న దావూద్ లేచాడు. సిగరేట్ అంటించుకుని టెర్రస్ చివరకు వెళ్లాడు. ముక్కలైన ఐ ఫోన్ ను తీసుకుని బడేమియా కూడా దావూద్ పక్కకొచ్చాడు.

గట్టిగా ఒక బఫ్ పీల్చి సిగరేట్ ను బడేమియాకు ఇచ్చాడు దావూద్. చిన్నగా నవ్వాడు. ఏం జరగబోతుందో బడేమియాకు అర్థం కాలేదు.

“ జీవితంలో పైసానే సర్వస్వం అనుకున్న.. బెదిరించిన. భయపెట్టిన. దోచుకున్న. సలామ్ అన్నోడిని సంకల పెట్టుకున్న. గులామ్ కానోడిని మట్టిల కలిపిన. కంటికి కనిపించని సామ్రాజ్యానికి కింగ్ అయ్యాను. వేల కోట్లు సంపాదించిన. కంటి చూపుతో ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని శాసిస్తున్నా కాని ఏం లాభం” బడేమియాను చూశాడు దావూద్

సిగరేట్ ను దావూద్ కు ఇచ్చాడు బడేమియా. నోట్లో సిగరేట్ ఉండగానే దావూద్ మాట్లాడుతున్నాడు.

“  నేను సంపాదించిన దాని కంటే నేను కోల్పోయిందే ఎక్కువ భయ్యా. నా తొలి ప్రేమ బొంబయ్ ని వదిలిపెట్టిన. నా అన్నవాళ్లను పోగొట్టుకున్న. నా చెల్లేను చివరి చూపు కూడా చూచుకోలేదు. ఇక్కడ ఎప్పుడు ఎటు దిక్కు నుంచి ఎవడు వచ్చి చంపుతాడో అని భయం భయంగా బతుకుతున్న” దావూద్ నోట్లోని సిగరేట్ ఆరిపోయింది.  .

“చూసినవా ఈ సిగరేట్ కు కూడా నేను లోకువైన. ఇస్ కీ మాకీ” అని సిగరేట్ ను కాలి కిందేసి కసాబిసా తొక్కాడు. బడేమియా కళ్లలో నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి . అది చూసి దావూద్ కూడా కొంచెం ఎమోషన్ అయ్యాడు. బడేమియాకు ఒక జాదూ కీ జప్పి ఇచ్చాడు. కళ్లు తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చాడు.

“ఇప్పుడు నేను నీకు రైట్ టైంలో రైట్ సజేషన్ ఇచ్చిన కదా. సేమ్ ఇట్లనే వాడికి ఇచ్చినట్టే  నాక్కూడ ఎవరైనా మంచి సలహా ఇచ్చి ఉంటే  దీనమ్మా జీవితం ఇంకోలా ఉండేది” గద్గద స్వరంతో దావూద్

“వాడెవడు? మంచి సలహా ఇచ్చిన ఆ ఎవరు ఎవడు?” కళ్లతో పాటు ముక్కు కూడా తుడుచుకుంటూ బడేమియా అడిగాడు.

“అదే భయ్యా ఆ నీరవ్ మోడీ ఉన్నడు కదా వాడే. ఎవడో వానికి సూపర్ ఐడియా ఇచ్చిండు. అందుకే ఇయ్యాల వేల కోట్ల రూపాయలను జేబులేసుకున్నడు. సేమ్ నీరవ్ లెక్కనే మనం కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకుల్నో లేదంటే ఇంకేదైనా బ్యాంకుల లోన్ తీసుకుంటే ఇయ్యాల మన పరిస్థితి ఇట్లుండేది కాదు” ఎమోషన్ ను కంటిన్యూ చేస్తూ దావూద్

అట్లా లోన్ తీసుకుని ఇట్లా పారిపోతే మన బొచ్చు కూడా పీకలేరు ఈ బ్యాంకోళ్లు. దోచుకున్న పైసలతోని మంచిగ ఏ లండన్ కో , అమెరికాకో పోయి నా సామి రంగా. ఆ మజానే వేరుంటుంటే.  ఈ తుప్లీస్ పాకిస్తాన్ ల ఉండకపోయేవాళ్లం” వెనక్కి తిరిగిన దావూద్ కు బడేమియా కనిపించలేదు.

చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. తన ట్రాజెడీ స్టోరీ చెప్పి పాపం బడేమియాను ఏడిపించాను అని దావూద్ మస్తు ఫీలయిండు. జేబు లో నుంచి ఫోన్ తీసి ఫేస్ బుక్ ఓపెన్ చేసిండు. ఇంతల్నే బడేమియా వచ్చిండు. చేతిలో ఏవో పేపర్లు ఉన్నయి

“ దావూద్ తూ ఫికర్ నై కర్నా. ఇండియాకు ఫోన్ చేసిన. లోన్ ఇయ్యడానికి ఓ బ్యాంక్ రెడీగా ఉంది. జస్ట్ నువ్వు ఈ పేపర్ మీద సైన్ చేయి. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ వాళ్లే చూసుకుంటరట. మన స్విస్ అకౌంట్ లకే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తరట” సంతోషంతో బడేమియా చెప్తూ పోతున్నడు.

దావూద్ కళ్లు మెరిశాయి. వైట్ హౌజ్ లైట్లు  వెలిగాయి.

“కరెంటు వచ్చింది. కిందకు రమ్మని  దావూద్ బేగం జరీనా పిలుస్తోంది. …..