స్కూల్ పిల్లలను చిదిమేసిన బొలేరో...9 మంది మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్ పిల్లలను చిదిమేసిన బొలేరో…9 మంది మృతి!

February 24, 2018

ఒక్కడు చేసిన తప్పుకు 9 మంది విద్యార్థులు బలయ్యారు.  24 మంది గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నారు. వేగంగా వచ్చిన బొలేరో చిన్నారులను చిదిమేసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. పాఠశాల దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడే ఒక్కసారిగా అక్కడకు వచ్చిన ఓ బొలేరో వాహనం విద్యార్థులను ఢీ కొట్టింది. దీనితో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విద్యార్థులను గుద్దిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకున్న  డ్రైవర్ను అరెస్ట్ చేయాలంటూ స్థానికులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు బీహార్ సీయం నితీశ్ రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.