వీటి ధర రూ.97 కోట్లే - MicTv.in - Telugu News
mictv telugu

వీటి ధర రూ.97 కోట్లే

October 28, 2017

చెప్పులు మహా అయితే ఎంత ధర ఉంటాయి. వందలు, వేలు, ఇంకా మంచివైతే లక్షల్లో ఉంటాయి కదా. కానీ బ్రిటన్ కు చెందిన ఓ డిజైనర్ చేసిన ఈ చెప్పులు(హై హీల్స్) ధర మాత్రం 15.1 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.97 కోట్లు. డెబ్బీ వింఘమ్‌ అనే డిజైనర్ ఎంతో మంది సెలబ్రెటీలకు, రాజవంశీయులకు, సంపన్నులకు అద్భుతమైన యాక్ససరీస్‌ను డిజైన్‌ చేస్తోంది.

గతంలో ఆమె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్‌ ‘రెడ్‌ డైమండ్‌ అభయ గౌన్‌’ను తయారు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ హైహీల్స్‌ను దుబాయ్‌కు చెందిన ఓ కుటుంబం కోసం తయారు చేసింది.ఈ హైహీల్స్‌లో మూడు అరుదైన గులాబీ రంగు వజ్రాలతో పాటు, వెయ్యి చిన్న డైమండ్లను పొందు పరిచింది. వీటికి ఉన్న సోల్‌, జిప్‌ కూడా బంగారంతో తయారు చేసింది. లెదర్‌కు 24 క్యారెట్ల బంగారం పూత పూశారు. వీటిని కుట్టేందుకు 18 క్యారెట్ల బంగారం దారాన్ని ఉపయోగించారు. ఇంత ఖరీదైన చెప్పులు వేసుకొని గుడికో,మసీదుకో,చర్చికో వెళితే, చెప్పుల్ని సంకలో పెట్టుకొని దేవుణ్ణి దండం పెట్టుకోవాల్సిందే