హెల్మెట్ లేకుండా బైక్ .. నిండు గర్భిణి బలి - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్ లేకుండా బైక్ .. నిండు గర్భిణి బలి

March 8, 2018

హెల్మెట్ లేకుండా బైకు నడపుతూ పోలీసులకు చిక్కకుండా పారిపోవాలనుకున్నాడు. తన వెనకాల గర్భిణి అయిన  భార్య వుందని కూడా చూడకుండా బైకును స్పీడుగా తోలాడు. ఈ క్రమంలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిండు గర్భిణి మరణించింది.  తమిళనాడులోని తంజావూరుకు చెందిన రాజా.. గర్భిణి అయిన తన భార్యతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై తిరుచి వెళ్తున్నాడు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతున్నాడని తిరువెరుంబర్‌ చెక్‌పాయింట్‌ వద్ద పోలీసులు బైక్‌ను ఆపబోయారు. పోలీసులకు చిక్కకుండా బైక్ స్పీడ్‌గా తోలాడు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజా బైక్‌ను వెంబడించాడు. పోలీసులకు దొరకుండా రాజా బైకు వేగం పెంచాడు. ఇంతలో అతని బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో రాజా భార్య అక్కడికక్కడే మరణించింది. బైక్‌‌పై నుంచి పడ్డప్పుడు అతడి భార్య మీద నుండి మరో వాహనం పోవటం వల్లే ఆమె చనిపోయిందని , ట్రాఫిక్‌ పోలీసు బైక్‌ను తన్నడం వల్లే వారు కిందపడిపోయారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆపమన్నప్పుడు  ఆపి ఫైన్ కట్టి వెళ్ళిపోయుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఇంకొందరు అంటున్నారు.