బీజేపీ కార్యకర్త అత్యాచార యత్నం - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ కార్యకర్త అత్యాచార యత్నం

November 20, 2017

టోల్‌గేట్‌ఫీజు చెల్లించమని మహిళా ఉద్యోగి అడిగినందుకు ఓ బీజేపీ కార్యకర్త రెచ్చిపోయాడు. హరియాణాలోని ఖేర్కిదౌలా టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన శనివారం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం టోల్‌ప్లాజా వద్ద మహిళా ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నది. ఎస్‌యూవీ కారులో వెళ్తున్న సదరు కార్యకర్తను టోల్‌గేటు ఫీజు చెల్లించామని అడిగినందుకు ఆమెపై రెచ్చిపోయాడు. నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు.అంతటితో ఆగకుండా ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. నన్ను టోల్‌గేట్ ఫీజు అడుగుతావా అంటూ  అక్కడున్న క్యాబిన్లను పగులగొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.  వాటి ఆధారంగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తొందరలోనే నిందితుణ్ణి పట్టుకుంటామని పోలీసులు వివరించారు.