లైంగిక వేధింపుల్లో ట్రంప్‌ కు బ్లాక్ బెల్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

లైంగిక వేధింపుల్లో ట్రంప్‌ కు బ్లాక్ బెల్ట్

November 24, 2017

‘లైంగిక వేధింపుల్లో  ట్రంపుకు బ్లాక్ బెల్టు ఇవ్వొచ్చు’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు బిల్టీ బాల్డ్‌విన్. డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ అల్ ప్రాంకెన్‌  లైంగిక వేధింపులక పాల్పడ్డినల్లు ఆరోపణలు  వస్తున్న క్రమంలో ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్  ట్విట్టర్లో స్పందించాడు.

బిల్లీ వెంటనే అతనికి సమాధానం చెప్పాడు. ‘ లైంగిక వేధింపుల్లో  మీ నాన్నను మించిన యోధుడు లేడు. మహా ఘనుడు. బ్లాక్ బెల్ట్ ఇవ్వొచ్చు. ఓసారి ప్లాజా హోటల్లో నేను ఇచ్చిన పార్టీకి మీ నాన్నను  పిలవక పోయినా వచ్చి నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. తన హెలికాప్టర్‌లో అట్లాంటాకు రావాలని బలవంత పెట్టాడు.. నా భార్య అతణ్ని అందరిముందూ  గెంటేసింది  ’ అంటూ ట్విట్టర్లో తెలిపాడు.  

బిల్లీ భార్య  చైన్నా భార్య ఫిలిప్స్ గతంలో ట్రంప్‌తో స్నేహంగా ఉండేది. ఎందుకో వారి మధ్య వివాదాలు చెలరేగి దూరమయ్యారు. అధ్యక్ష ఎన్నిక ప్రచారం నుంచే బిల్లీ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాడు. ఇక బిల్లీ సోదరుడు, నటుడు అయిన అలెక్‌ బాల్డ్‌విన్‌ కూడా  ట్రంప్‌ మీద ఓ సటైరిక్‌ టీవీ షో నిర్వహిస్తున్నాడు.