కృష్ణానగర్‌లో బాంబు పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణానగర్‌లో బాంబు పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

April 20, 2018

సినిమాల్లో వాడే స్మోక్ బాంబు పేలడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం ఉదయం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఈ బాంబు పేలుడు సంభవించింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్ గూడ శ్రీకృష్ణానగర్ బి బ్లాక్‌లోని మొదటి అంతస్తులో  సినిమా షూటింగ్స్‌లో సెట్స్‌లో వాడే స్మోక్‌ బాంబు పేలింది. సిలిండర్ల సాయంతో బాంబులు తయారు చేస్తుండగా అవి అకస్మాత్తుగా పేలాయి. ఈ ప్రమాదంలో అశోక్ అనే యువకుడి కాళ్ళకు, చేతులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా స్మోక్‌ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.