పెళ్లైన రెండో రోజే నగలతో జంపైన పెళ్లి కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లైన రెండో రోజే నగలతో జంపైన పెళ్లి కూతురు

November 25, 2017

మీకు హిందీలో సోనమ్ కపూర్ నటించిన ‘డాలీకి డోలి’ సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ పెళ్లిళ్లు చేసుకుని, పెండ్లి కొడుక్కి మత్తుమందు ఇచ్చి నగలతో ఉడాయిస్తూ ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది.

రూర్కీ జిల్లా కువాన్ హెది గ్రామంలో అజయ్ త్యాగి అనే వ్యక్తికి కాయ అనే మహిళ పరిచయమై పెళ్లి చేసుకుంది. రెండు రోజులు వధూ వరులిద్దరూ బాగానే ఉన్నారు. ఇంతలో భార్య కాయను తీసుకుని భర్త అజయ్ షాపింగ్ కి వెళ్లాడు.

ఈనేపథ్యంలో భర్తకు మస్కా కొట్టి ఇంటికొచ్చి అత్తింటివారు పెట్టిన నగలను తీసుకుని పెళ్లి కూతురు ఉడాయించింది. మోసపోయాం అని తెలుసుకున్న అజయ్ మరియు అతని కుటుంబ సభ్యులు  వధువుపై  పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వధువుకోసం గాలిస్తున్నారు.