mictv telugu

పిల్ల పిశాచాలు.. కుక్కకు టపాసులు తినిపించి, పేల్చి..

December 29, 2018

దుడుకు పిల్లలు శ్రుతిమించారు. మూగజీవి నోట్లో టపాసులు పెట్టి పేల్చేశారు. ఆ కుక్క తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తోంది. దక్షిణ అమెరికా ఖండమైన పరాగ్వేలోని శాన్ లొరెంజో నగరంలో ఈ దారుణం జరిగింది.

rr

బాణసంచా కాల్చుతున్న పిల్లల వద్దకు ఓ కుక్క వచ్చింది. పిల్ల పిశాచాలు దాన్ని మరింత దగ్గరికి పిలిచారు. ‘దా..దాదా.. తిను, బాగా తిను.. ’ అంటూ దాని నోటికి వత్తుల తాడు అంటించిన టపాసుల సరాన్ని అందించారు. అది ఏదో తినుబండారం అనుకునుంది. క్షణాల్లో పటాసులు పేలాయి. కుక్కు నోట్లో, గొంతులో తీవ్ర గాయలై రక్తస్రావమైంది. దాన్ని పశువుల ఆస్పత్రి తరించి అత్యవసర చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని, తల్లిదండ్రులను పిల్లలను అదుపులో పెట్టాలని దానికి చికిత్స చేస్తున్న డాక్టర్ మెండెజ్ మార్టినెట్ సూచించారు. జంతువులపై హింసకు పాల్పడే పిల్లలు పెద్దయ్యాక నేరాలకు కూడా పాల్పడతారని, మొక్కై వంగనిది మానయ్యాక వంగదని అంటున్నారు.

Telugu news A dog has been left horrifically injured after being ‘fed’ a lit fireworks by a group of children in the city of San Lorenzo, Paraguay.