యువతిపై కత్తితో దాడి చేసిన తాగుబోతు ప్రియుడు - MicTv.in - Telugu News
mictv telugu

యువతిపై కత్తితో దాడి చేసిన తాగుబోతు ప్రియుడు

March 26, 2018

ప్రియుడు మద్యానికి అలవాటు పడ్డాడని ప్రియురాలు అతణ్ణి పెళ్ళి చేసుకోనని చెప్పింది. అంతే ఆమె మీద కక్ష్యగట్టిన అతను స్నేహితులతో కలిసి ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. కలకలం రేపిన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పాతబస్తీలోని బహుదూర్‌పురాలో నివాసం ఉంటున్న అబ్బాస్, సమియా ఫాతిమాను (18) ప్రేమించాడు. అప్పట్లో సమియా కుటుంబం పాతబస్తీలోని బహదూర్‌పురాలో నివాసం వుండేవారు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కూడా. అప్పటికే అబ్బాస్ తాగుడుకు బానిసయ్యాడని సమియా అతనికి దూరంగా వుంటోంది.తననే పెళ్ళి చేసుకోవాలని నిత్యం సమియాను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతని వేధింపులకు తాళలేక సయిదా వాళ్ళ కుటుంబం బంజారాహిల్స్ రోడ్ నెం.12 బోళానగర్‌కు మాకాం మార్చారు. సయిదా 10 తరగతి చదివి ఇంట్లోనే వుంటోంది. అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న సమియా ఫాతిమా వద్దకు నలుగురు యువకులు వచ్చి దాడికి దిగారు. వారిలో ఒకరు కత్తితో సమియాపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. దీంతో బాధితురాలి తల్లి సయిదా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫాతిమా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా… బాధితురాలి తల్లి సయిదా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.