సినివారంలో ‘ఎ గర్ల్ ఇన్ ద సిటీ’ పాట ప్రదర్శన - MicTv.in - Telugu News
mictv telugu

సినివారంలో ‘ఎ గర్ల్ ఇన్ ద సిటీ’ పాట ప్రదర్శన

March 26, 2018

ప్రతీవారం రవీంద్రభారతి వేదికగా రెండవ అంతస్తు పైడిజయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ‘సినివారం’ కార్యక్రమం జరుగుతుంది. 23.03.2018 సినివారంలో మైక్‌టీవీ పాట ‘ ఎ గర్ల్ ఇన్ ద సిటీ ’ ప్రదర్శించారు. ఈ పాట చాలా బావుందని, హైదరాబాద్ జిందగీని కళ్లకు కట్టిందని ప్రేక్షకులు ప్రశంసించారు.  ‘హైదరాబాద్‌ కల్చర్‌ను కొత్త వెర్షన్‌లో చెప్పారు. మైక్ టీవీ చేసిన అద్భుతమైన పాట ఇది. ముందు ముందు కూడా ఇలాంటివి చాలా చెయ్యాలి ’ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘ పెళ్ళిచూపులు’ సినిమా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ హృదయానికి ఆకట్టుకునేలా పాట చేశారు. కొత్తగా అనిపించింది. తెలిసిన నగరాన్ని మీదైన శైలిలో చెప్పి మెప్పించారు ’ అన్నారు.పాట దర్శకురాలు శశికిరణ్ నారాయణ మాట్లాడుతూ.. ‘ నాకు ఈ నగరంతో 20 ఏళ్ళ అనుబంధం వుంది. ఇంత మంచి పాట చేసే అవకాశాన్ని అందించిన మైక్ టీవీకి కృతజ్ఞతలు ’ తెలిపారు. అనంతరం పాటకు ర్యాప్ అందించిన మేఘ్‌రాజ్ స్పందిస్తూ ‘ఇంత మంచి పాటకు నాకు ర్యాప్ అందించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను ’ అన్నారు. పాట సాంతం కనిపించి ఆకట్టుకున్న శ్రీనైరుతి ‘నన్నునేను ఫస్ట్‌టైం స్క్రీన్ మీద చూసుకోవడం చాలా ఆనందంగా వుంది. మమ్మీ దర్శకత్వంలో నేను నటించడం గొప్ప ఫీల్ ’ అన్నారు.

ఎ గర్ల్ ఇన్ ద సిటీ :

హైదరాబాద్ నగరం అనేది ఒక జిందగీ, మత్తు, మాయ, వ్యసనంలాంటిది. ఈ మాట ఏ ఒక్కరో అనేమాట కాదు ఇక్కడికి ఉత్త చేతులతో వచ్చి చేతులనిండా సంపాదిస్తున్న ప్రతీ ఒక్కరూ అంటారు. ‘గంగా జమున తహెజీబ్’ అనే అద్భుతమైన సంస్కృతి కేవలం హైదరాబాద్‌లోనే మనకు కనిపిస్తుంది. ఈ నగరం దిక్కుతోచని  చాలామందికి దిక్సూచి అయింది. ఇక్కడ బతికినవాడు ప్రపంచంలో ఎక్కడైనా బతుకుతాడు. ఇలా హైదరాబాదు నగరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ప్రయత్నమే మైక్ టీవీ చేసింది.

ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి హైదరాబాద్ షహర్‌ను అందంగా చూపించే ప్రయత్నం చేసింది. దివంగత కమెడియన్ ఎమ్.ఎస్. నారాయణ గారి తనయ శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో ఈ పాట రూపు దిద్దుకోవడం ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఎమ్.ఎస్. నారాయణ మనవరాలు శ్రీనైరుతి నటించడం. ‘ భలె చక్కెర మనుషులు తిరిగే నగరమిదే ’ అంటూ సాగే పల్లివితో పాట ఆద్యాంతం ఆసక్తికరంగా సాగుతుంది. స్మరణ్ సాయి సంగీతం అందించగా, సిద్ధార్థ్ ఎస్‌జె సినీమటోగ్రఫీ అందించారు. ఎల్ గ్యాంగ్ వెంకీ లిరిక్స్ రాసిన ఈ పాటకు సినివారం వేదికగా మంచి రెస్పాన్స్ వచ్చింది.