ప్రియుడి కోసం అతని కుమార్తెను చంపిన ప్రియురాలు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుడి కోసం అతని కుమార్తెను చంపిన ప్రియురాలు

March 29, 2018

ఒంటి సుఖానికి మరిగిన కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తల దించుకునేలా అరాచకాలకు పాల్పడుతున్నారు. శారీరక సుఖం ముందు బంధాలు వుంటే ఎంత తెంచుకుంటే ఎంత అనుకుంటున్నారు. అలాంటి ఓ ఘటనే ముంబాయిలోని నాలాసోపారాలో  చోటుచేసుకుంది. పెళ్లికి అడ్డుగా ఉందని ఓ మహిళ, ఐదేళ్ల బాలికను ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసింది. ముంబయిలలో స్థానికంగా నివాసం ఉంటున్న సంతోష్‌ సరోజ్‌ అనే వ్యక్తికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే కొంతకాలం క్రితమే సంతోష్‌ తన భార్యకు విడాలిచ్చాడు. అప్పటినుంచి ఆ పాప తండ్రి సంరక్షణలోనే వుంటోంది. ఇదిలా వుండగా సంతోష్‌కు అనితా భాఘేలా(25) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారు సహజీవనం చేసే వరకు వెళ్ళింది.తనను రెండోపెళ్లి చేసుకోవాల్సిందిగా సంతోష్‌ను చాలాసార్లు అడిగింది అనిత. తనకు ఐదేళ్ళ కుమార్తె వుందని చెప్తూ సంతోష్‌ సున్నితంగా అనిత అభ్యర్థనను తిరస్కరించాడు. అనిత మాత్రం ఎలాగైనా సంతోష్‌ను తన సొంతం చేసుకోవాలని పంతం పెట్టుకుంది. అందుకు అడ్డుగా వున్న అతని కూతురిని చంపేద్దామనుకుంది. తనొక ఆడదాన్ని అన్న విషయం మరిచిపోయింది. రేపు తను కూడా తల్లినవుతాననే విషయాన్ని పక్కనపెట్టి సంతోష్ కుమార్తెను హత్య చేయాలని పథకం రచించింది. అందులో భాగంగా ఈ నెల 24న బాలికకు చాక్లెట్లు చూయించి కిడ్నాప్‌ చేసింది. మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చి ఏమీ ఎరుగని నంగనాచిలా నాటకమాడింది.

కూతురు కనపడకపోవడంతో తండ్రి సంతోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలు లభించాయి. ఆ వీడియోలో అనిత బాలికకు చాక్లెట్లు ఇవ్వడం కెమెరాలో రికార్డు అయింది. అలాగే నాలాస్‌పోరా రైల్వే స్టేషన్‌లో బాలికతో ఆ మహిళే రైలు ఎక్కడం కూడా రికార్డు అయింది. దీంతో పోలీసులు అనితను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది.  గుజరాత్‌లోని నావ్సారి జిల్లాలోని ఓ టాయిలెట్‌లో బాలికను చంపినట్టు తెలిపింది. బాలిక శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనితను అరెస్ట్ చేశారు. సంతోష్‌ ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు అతణ్ని కూడా విచారించారు. తనకు అంజలి అనే మహిళ తెలియదని సంతోష్‌ చెప్పడం గమనర్హం. ఈ హత్యలో తండ్రి పాత్ర కూడా వుందేమోననే కోణంలో పోలీసుల తమ విచారణను వేగవంతం చేశారు.