mictv telugu

విమానంలో గుండెను మరిచిపోయారు..

December 14, 2018

ప్రయాణాల్లో బ్యాగులను మరిచిపోవడం మామూలే. అందుకే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. కొందరైతే పిల్లలను కూడా మర్చిపోతుంటారు. దీనికీ లెస్ లగేజ్ సామెత వర్తిస్తుంది..! ఇక విషయంలోకి వస్తే.. ఒకే లగేజీని కూడా మరిచిపోయారు విమాన సిబ్బంది. అది మామూలు లగేజీ కాదు.. మానవ గుండె..!!

tt

అమెరికాలో జరిగిందీ తతంగం. గుండె మార్పిడి కోసం ఓ గుండెను ఐస్ డబ్బాలో ఉంచి సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన విమానంలో పంపారు. దాన్ని కాలిఫోర్నియా నుంచి సియాటెల్ ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అయితే సియాటెల్లో విమానం ల్యాండయ్యాక గుండెకు సబంధించిన సిబ్బంది దాన్ని మరిచిపోయి వెళ్లిపోయారు. విమానం డల్లాస్‌కు బయల్దేరింది. అందులోని ప్రయాణికులు ఐస్ బాక్సులోని గుండెను చూసి బెదిరిపోయారు. మూడు గంటల పాటు ఆ హృదయం విమానంలోని కార్గొలో ఉండిపోయిందని తర్వాత తేలింది. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి సియాటెల్‌లో ల్యాండ్ చేసి,  గుండెను ఆస్పత్రికి పట్టుకెళ్లారు. పెద్దగా ఆలస్యం కాకపోవడంతో నష్టం తప్పింది. మానవ గుండెను శరీరం నుంచి తొలగించాక ఆరుగంటల వరకు ఐస్ బాక్సులో ఉంచొచ్చు.