ఇదొక ఫేస్బుక్ లేడీ మగరాయుడి కథ. ఫేస్బుక్ సాక్షిగా అబ్బాయిలా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందంగా, రిచ్‌గా అమ్మాయిలకు వల వేసింది. చాట్ చేసింది.. మెల్లగా ప్రేమించింది.. పెళ్ళి చేసుకుంది.. కట్నం కోసం భార్యలను వేధించి, చివరికి తన బండారం బయటపడి పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతోంది. అత్యంత ఆశ్చర్యకర ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో జరిగింది. నైనితాల్ ఎస్పీ జన్మేజయ్ ఖండూరి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వీటీసేన్ 2013 లో మగాడి రూపంలో కనిపించి ఫేస్బుక్లో క్రిష్ణసేన్ పేరుతో అకౌంట్ తీసింది. తాను మగాడినని చెప్పుకుంటూ పలువురు మహిళలతో చాటింగ్‌లు కూడా చేసింది. 2014 లో కాత్గోడమ్కు చెందిన ఓ మహిళను పెళ్ళి చేసుకుంది. వారితో తాను అలీగఢ్‌లో ఉన్న ఓ సీఎఫ్ఎల్ బల్బ్ వ్యాపారవేత్త కొడుకునని అబద్ధం చెప్పి నమ్మించి ఆమెను పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొన్నాళ్ళకే భార్యను వేధింపులకు గురి చేయటం మొదలు పెట్టింది.
తన కుటుంబం నుంచి వున్న ఫ్యాక్టరీ నిర్మాణం కోసమని ఎనిమిదిన్నర లక్షల రూపాయలు గుంజింది. ఇదేదో బాగుందనుకున్న స్వీటీసేన్ 2016 లో మరో మహిళను కూడా ఫేస్బుక్లో ట్రాప్ చేసి, రెండో పెళ్లి చేసుకుంది. విచిత్రమేమిటంటే క్రిష్ణాసేన్ మొదటి పెళ్లి సమయంలో ఈ రెండో భార్య ఓ అతిథిగా అక్కడ ఉంది. హల్ద్వానీ ప్రాంతంలోని టికోనియాలో ఓ రూమ్ తీసుకొని ఇద్దరు భార్యలను అక్కడే ఉంచింది. ఆమె మగాడు కాదన్న సంగతి రెండో భార్యకు తెలవడంతో తనకు డబ్బు ఆశ చూపి నోరు మూయించింది.
అబద్ధం ఎంతకాలమో దాగదన్నట్టు .. మొదటి భార్య కట్నం వేధింపుల కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ‘ చిన్నప్పట్నించీ తనకు మగబుద్ధులే అలవాటు పడ్డాయి. నేను ఆడదాన్ని అనుకోవటానికి నా మనస్సాక్షి అస్సలు ఒప్పుకోకపోవటంతో మగాడిగానే వుండాలని ఫిక్సయ్యాను. చిన్నప్పట్నించీ మగపిల్లల బట్టలే వేసుకున్నాను. హెయిర్ కట్ కూడా మగపిల్లల మాదిరే చేసుకునేదాన్ని, మోటార్ సైకిల్ నడుపుతూ, సిగరెట్లు కూడా తాగేదాన్ని ’ అని క్రిష్ణసేన్ పోలీసులకు చెప్పింది. సెక్స్‌టాయ్స్ వాడి భార్యలతో సెక్స్‌లో పాల్గొన్నానని చెప్పింది. పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేసి మహిళే అని తేల్చారు. ఫేస్బుక్లో ఎవరు అమ్మాయో, ఎవరు అబ్బాయో తెలుసుకోలేని సందగ్ధత నెలకొన్నదని అంటున్నారు నెటిజనులు.