ఆధార్ తో లింకుకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వంతు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ తో లింకుకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వంతు..!

September 15, 2017

డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డుకు లింక్ చేసే యోచనలో ప్రభుత్వం వున్నట్టు కేంద్ర మంత్రి రవి శంకర ప్రసాద్ తెలిపారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017 సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ఆధార్ ఒక డిజిటల్ గుర్తింపు కార్డు, డిజిటల్ గుర్తింపు వల్లే భౌతిక గుర్తింపు సాధ్యమౌతుందన్నారు. ఆధార్ కార్డును పాన్ కార్డుతో కూడా లింకు చేసాము. అదెందుకంటే నగదు బదిలీలు, పన్నుల సక్రమణ చెల్లింపులుంచడానికే అని చెప్పారు. ఇండియా మొత్తం ఒక్క ఆధార్ కార్డుతో డిజిటల్ ఇండియా అవనుంది. కాబట్టి డిజిటల్ పాలన చాలా సమర్థవంతంగా వుంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యక్తిగత పత్రాలకు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తోంది. మొన్నటి వరకు సిమ్ కార్డులకు కూడా ఆధార్ లింక్ అన్నారు. తాజాగా డ్రైవింగ్ లైసెన్సుకు కూడా ఆధార్ లింక్ ను జతపరచడం తప్పనిసరి అంటున్నారు.