ఓ టీచరమ్మ ఏందిది? చిన్న పిల్లను గీ తీర్గ కొడ్తవా? - MicTv.in - Telugu News
mictv telugu

ఓ టీచరమ్మ ఏందిది? చిన్న పిల్లను గీ తీర్గ కొడ్తవా?

February 23, 2018

హైదరాబాద్‌లోని  పఠాన్ చెరువులో ఉన్న మంజీరా హై స్కూల్‌లో ఓ టీచర్ చిన్న పిల్లను చితకబాదింది. ఎల్‌కేజీ చదువుతున్న ఓ పిల్ల చెప్పినట్టు వినడంలేదని టీచర్ వీపు వాచేలా కొట్టింది. విద్యార్థి వీపు మొత్తం దద్దులతో కందిపోయింది.

https://twitter.com/ANI/status/967022942570844160/photo/1

ఏడుస్తూ ఇంటికి వెళ్లిన పాప ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పిల్లలన్నాక అల్లరి చేస్తారు ఆ మాత్రం దానికే చచ్చేటట్లు కొడతారా అని ఆ తల్లిదండ్రులు ఆ టీచర్ పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఆ టీచర్‌పై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.