పెళ్లి కూతురితో సెల్ఫీ...ఓ యువకుడి ప్రాణాల మీదికొచ్చింది ! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కూతురితో సెల్ఫీ…ఓ యువకుడి ప్రాణాల మీదికొచ్చింది !

February 14, 2018

పెండ్లంటే సందళ్లు, హంగామా హడావిడి మామూలే. పెండ్లికి వచ్చిన వారు అందరూ స్టేజీ మీద ఉన్న వధూ, వరులతో ఫోటోలు దిగుతారు అది కూడా కామనే. కానీ ఉత్తరప్రదేశ్  కాన్పూర్లో  పెండ్లిలో ఓ వింత సంఘటన జరిగింది. బంధువులందరూ ఆనందంలో జంటకు పెండ్లి చేశారు.

పెండ్లి తర్వాత అందరూ వారితో ఫోటోలు కూడా దిగారు. అప్పుడే ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చాడో తెలీదు. ఓ యువకుడు అకస్మాత్తుగా స్టేజీ మీదకు ఎక్కి పెండ్లి కూతురితో సెల్ఫీ తీసుకోబోయాడు. అంతే  పెండ్లి కూతురు తరపు బంధువులు ఒక్కసారిగా ఆ వ్యక్తిపై దాడి చేశారు.

నవ్వులు ఆనందాలు ఉన్న పందిట్లో ఒక్కసారిగా ఆగ్రహ మంటలు అంటుకున్నాయి. యువకుడిని చితకబాదిన బంధువులు అతడిని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. అయితే ఆ యువకుడు  ఎవరు? పెండ్లి కూతురికి ముందే తెలుసా? అన్న పలు విషయాలు తెలియాల్సి ఉంది. ఈఘటన మొత్తం మండపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.