పద్మావతిని హెచ్చరిస్తూ  కోటకు ఉరేసుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతిని హెచ్చరిస్తూ  కోటకు ఉరేసుకున్నాడు..

November 24, 2017

‘ పద్మావతి ’ సినిమా విడుదలను వ్యతిరేకిస్తే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపుతున్నది. చేతన్ కుమార్  40 ఏళ్ల వ్యక్తి సహర్‌గడ్ కోటకు ఉరి వేసుకుని చనిపోయాడు. పక్కనే వున్న కోట గోడలపై, రాళ్ళపై పద్మావతి చిత్ర బృందాన్ని హెచ్చరిస్తూ రాసిన రాతలు కనిపించాయి. ‘మేం దిష్టబొమ్మలను మాత్రమే తగలబెట్టం. చంపుతాం.. పద్మావతి’ అనే రాతలు ఉన్నాయి. ఇది ఆత్మహత్యలా భావిస్తున్నా.. హత్య కూడా కావొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. పోస్టుమార్టం నవేదిక తర్వాతే అధికారులు స్పందిస్తామన్నారు.   రాజ్‌పుత్ కర్ణిసేన పద్మావతి చిత్ర విడుదలను తీవ్రంగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. యూపీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పద్మావతిని బ్యాన్ కూడా చేశారు. తాజా సంఘటన చిత్రం మీద మరింత ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తున్నది.