విమానం కొనడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

విమానం కొనడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు..

November 20, 2017

‘విమానం కొనడానికి నేను ఎయిర్ పోర్టుకొచ్చాను ’ అని ఓ వ్యక్తి పోలీసుల ముందు చిత్రవిచిత్రంగా మాట్లాడాడు.  చెన్నై అంతర్ఝాతీయ విమానాశ్రయంలోకి ఓ వ్యక్తి వీఐపీలు వెళ్ళే గేటు నుంచి రన్‌వేలోకి ప్రవేశించాడు. సీసీటీవీ ఫుటేజీలో ఆ వ్యక్తి రన్‌వేపై తిరుగుతున్నది ఎయిర్ పోర్ట్ అధికారులు చూశారు. వెంటనే అప్రమత్తమై అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా అతను చిత్రమైన సమాధానాలు చెప్పాడు.     ‘నేను విమానం కొనడానికి వచ్చాను. అందుకే ఇక్కడ తిరుగుతున్నాను ’ అని చెప్పేసరికి అతని మానసిక స్థితి బాగాలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘ‌ట‌న‌తో విమానాశ్ర‌యంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అతడి కుటుంబ స‌భ్యుల‌కు ఈ సమాచారం అందించారు. ఒక సాధారణ వ్యక్తి విమానాశ్రయంలోకి ఎలా ప్రవేశిస్తాడని, ఎయిర్ పోర్టులో భద్రత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.