నాంపల్లి కోర్టు వద్ద పోలీసుల జులుం - MicTv.in - Telugu News
mictv telugu

నాంపల్లి కోర్టు వద్ద పోలీసుల జులుం

April 16, 2018

మక్కామసీదు పేలుళ్ళ కేసు విచారణ  సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా ప్రతినిధులను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ ఆదేశాల అనుసారం పోలీసులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కోర్టు లోపలికి అనుమతించలేదు. ప్రింట్ మీడియా ప్రతినిధులను అనుమతించారు.

దీంతో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గేటు అవతల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొంతమందిని లోపలికి రానివ్వటం, కొంతమందిని రానివ్వకపోవటం మంచి పద్ధతి కాదని మీడియా ప్రతినిధులు తెలపారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళను చెదరగొట్టే సమయంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో టీవీ9 క్రైం రిపోర్టర్ విజయ్‌కు గాయాలయ్యాయి. మిగతా ప్రతినిధులకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి.