హైదరాబాద్‌కి షాన్, పహెచాన్.. ఈ పాటల గమ్మత్తుగ కనిపిస్తది. ఇరానీ చాయ్‌ల ఇక్కడి అర్బన్ లైఫ్‌ను రంగరించిన తీరు.. పాష్ లైఫ్‌కు, స్లమ్ లైఫ్‌కు సలాం చేస్తూ సాగుతుంది. ‘భలే చక్కెర మనుషులు తిరిగే నగరమిదే ’ అంటూ జనజీవితాన్ని కళ్ళకు కడుతుంది.
బిర్యానీ , మీఠా పాన్ మజా, చార్మినార్ చుట్టు ఓల్డ్సిటీల కొలువైన గాజుల సవ్వడులు జిందగీల మమేకమైన తీరు కళ్ళను కౌగిలించుకుంటుంది. మైక్ టీవీ ‘ఎ గర్ల్ ఇన్ ది సిటీ.. లవ్ యూ హైదరాబాద్’ పేరుతో ఈ పాటను రూపొందించింది. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో ఈ పాట రూపుదిద్దుకున్నది. ఇంకొక విశేషమేందంటే ఈ పాటలో నటించింది శశికిరణ్ కుమార్తె శ్రీనైరుతి!!
staring – Sri Nyruthy
Dop – Siddharth sj
Music – Smaran sai
Editing – c2c cut
Mixing – Sanjay das
Rap – MEGH-uh-WATT
Gssp Kalyan , Ganesh
Lyrics – L”gang venky
Vocals – smaran sai ,shree
Camera asst – Raju pittala
Executive Producer – Satish Manjeera
Co Producer – Damu Reddy Kosanam
Producer – Appi Reddy
Concept – direction Sasikiran Narayana