మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన దుండగుడు - MicTv.in - Telugu News
mictv telugu

మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన దుండగుడు

December 8, 2017

ఓ భూ వివాదం మహిళ ప్రాణాలను బలిగొన్నది. ఆస్తులు, భూములు, డబ్బు కన్నా మనుషులు ఏమాత్రం ముఖ్యం కాదనుకుంటున్న కొందరు వ్యక్తుల ధోరణికి ఈ దృష్టాంతం అద్దం పడుతున్నది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లిలో ఈ దారుణం జరిగింది. ఇందుకు పాత కక్షలు తోడయ్యాయి. దీంతో రంజిత్ అనే వ్యక్తి మహిళపై ట్రాక్టర్ ఎక్కించాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.

వరగపల్లి గ్రామానికి చెందిన జగన్నాధ రెడ్డికి రంజిత్‌కు మధ్య కొంత కాలంగా భూతగాదాలపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. కాగా భూమిపై ఇంజక్షన్‌ ఆర్డర్‌ తీసుకువచ్చి రంజిత్‌ ఆ భూమిని ట్రాక్టర్‌తో సాగు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడికొచ్చిన జగన్నాధరెడ్డి ( 65 ), ఆయన భార్య విమలమ్మ ( 52 )లు రంజిత్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

కేసు కోర్టులో వుండగా ఎలా దున్నుతావని వారు అతణ్ణి ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన రంజిత్ విచక్షణ కోల్పోయి వారి మీదకు ట్రాక్టర్‌ను ఉసిగొలిపాడు. చక్రాల కింద పడ్డ విమలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. జగన్నాధ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా నిందితుడు పరారీలో ఉన్నాడు.