అంబులెన్స్‌‌లో ప్రసవం..డ్రైవర్,టెక్నీషియన్లు పురుడు పోశారు ! - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్‌‌లో ప్రసవం..డ్రైవర్,టెక్నీషియన్లు పురుడు పోశారు !

March 14, 2018

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ మహిళ అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లికుదురు మండలం భగ్న తండాకు చెందిన ఓ గర్భిణీకి నొప్పులు వస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. వెంటనే అంబులెన్స్‌లో గర్భిణీని ఎక్కించుకొని తొర్రూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. ఆమెకు తోడుగా ఇద్దరు మహిళలు అంబులెన్స్‌లో వున్నారు. అయితే మార్గమధ్యంలోనే ఆ మహిళకు నొప్పులు ఎక్కువయ్యాయి.

దీంతో అంబులెన్స్‌లో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉదయ్, పైలట్ కొమురయ్య ఆ మహిళకు కాన్పు చేశారు. డెలివరీ తర్వాత తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అనంతరం వాళ్లను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పైలట్ కొమురయ్య, టెక్నీషియన్ ఉదయ్ మంత్రసానుల్లా చేసిన మంచి పనికి స్థానికులు వారిని అభినందించారు.