బ్లూ కలర్‌లో పిల్లలకు ఆధార్ కార్డు - MicTv.in - Telugu News
mictv telugu

బ్లూ కలర్‌లో పిల్లలకు ఆధార్ కార్డు

February 26, 2018

ఐదేళ్ళలోపు పిల్లలకు బ్లూ కలర్‌లో ఆధార్ కార్డులు జారీ చేస్తున్నట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ దిశలో పిల్లలు పుట్టగానే ఆధార్ రిజిస్టర్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీనికి ‘ బాల ఆధార్ ’ అని పేరు పెట్టారు. ఇది నీలి రంగులో ఉంటుంది. పిల్లలు ఐదేళ్ళ వయసు వచ్చేవరకు ఇది పని చేస్తుంది.

ఆ తర్వాత కచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్లు మళ్లీ 15 ఏళ్ల తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అప్‌డేట్‌ను ఫ్రీగానే చేస్తారు. 5 ఏళ్ళ వయసప్పుడు ఒకసారి, 15 ఏళ్ల వయసులో మరోసారి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవలసి వుంటుంది.

అయితే ఐదేళ్లలోపు ఉన్న వారికి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఏడాది వయసు దాటిన పిల్లలందరికీ ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పిల్లల ఆధార్ కార్డులకు తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఆధార్ వివరాలను లింకు చేస్తారు.