బావిలో తేలిన వేలాది ఆధార్ కార్డులు ! - MicTv.in - Telugu News
mictv telugu

బావిలో తేలిన వేలాది ఆధార్ కార్డులు !

March 13, 2018

పురావస్తుశాఖ వారి తవ్వకాలలో పురాతన వస్తువుల బయటపడ్డట్టు ఓ పాడుబడ్డ బావిలో వేలకొద్ది ఒరిజినల్ ఆధార్ కార్డులు బయట పడ్డాయి. అన్నింటికీ ఆధార్ అని ప్రభుత్వం చెబుతుంటే.. మరి వేల కొద్ది ఆధార్ కార్డులు బావిలో ఎందుకు పడేశారు? ఇంతకీ ఇది ఎవరి పని?

మహారాష్ట్ర యవత్ మాల్‌లోని ఓ పాడుబడ్డ బావి ఉంది. అది తాగునీటి బావి కావడంతో దాన్ని బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో  కొందమంది ఎన్జీవోలు ఆ బావిలో ఉన్న చెత్తను తొలగించడానికి పూనుకున్నారు. అయితే చెత్తకు బదులు అందులోంచి కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు వచ్చాయి. గోనె సంచుల్లో ఆధార్ కార్డులను కుక్కి,  సంచికి రాయిని కట్టి బావిలో పడేశారని అధికారులు గుర్తించారు. ఇంతకీ ఇది ఎవరి పని? ఇలా ఆధార్ కార్డులను బావి పాలు ఎందుకు చేశారు? వారిని ఊరికే వదల కూడదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు విచారణకు ఆదేశించారు. ఆధార్ కార్డులతో అక్రమార్కులు ఏదైనా పథకం వేశారా? అందుకే ఎవ్వరికి దొరక కూడదని ఇలా చేసుంటారా? అని అనుమానిస్తున్నారు.