ఆరేళ్ల తర్వాత అతన్ని మళ్లీ ఖైదీ చేసిన ఆధార్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆరేళ్ల తర్వాత అతన్ని మళ్లీ ఖైదీ చేసిన ఆధార్ !

March 1, 2018

ఓ వ్యక్తి భార్యను ముక్కలుగా నరికిన కేసులో శిక్షపడి జైల్లో చిప్పకూడు తింటున్నాడు.  అయితే జైల్లో పెట్టే  కూడు రుచీ పచీ లేదనుకున్నాడో ఏమో. జైలు నుంచి ఆరేళ్ల క్రితం  తప్పించుకున్నాడు. కానీ ఆరేళ్ల తర్వాత ఆధార్ అతని కొంప ముంచింది.

ముంబైకి చెందిన సతీశ్ మహిపాల్ వాల్మీకి  అనే వక్తి  2010లో  తన భార్యతో గొడవపడి  ఆమెను  ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఈ కేసులో అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే జైల్లో రెండేళ్లు ఉండి బోర్ కొట్టిందేమో  జైలర్ కు మస్కా కొట్టి జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆరేళ్లు పోలీసులకు దొరక్కుండా జాలీగా ఎంజాయ్ చేశాడు.  

అతని కోసం పోలీసులు కూడా  పోస్టర్లు కొట్టించి  మరీ తీవ్రంగా గాలించారు.  అయినా కూడా అతను పోలీసులకు చిక్కలేదు. అయితే  మొబైల్ నంబరుకు ఆధార్ లింక్ చేయడంతో  ఆ సమాచారం పోలీసులకు వెళ్లింది. దీనితో అతని అడ్రస్‌ను కనిపెట్టిన పోలీసులు  అతన్ని మళ్లీ నాసిక్ జైలుకు తరలించారు.  ఆరేళ్ల తర్వాత  ఆధార్ అతని కొంప ముంచింది.