అమెజాన్ కూడా మొదలు పెట్టింది.. ఆధార్ లింకు - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ కూడా మొదలు పెట్టింది.. ఆధార్ లింకు

December 2, 2017

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్..  ఆధార్ కార్డును అప్‌లోడ్ చేయమని అడుగుతోందా ? అయితే  కొంచం జాగ్రత్త వహించండి. మీ ఆధార్ నంబర్‌ను మూడో వ్యక్తి కి చెప్పితే ప్రమాదం తప్పదని  గత ఏడాదే ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆప్  ఇండియా ( యూఐడీఏఐ) కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే.అమెజాన్  కొన్నికేసుల్లో ఆధార్‌ను అనుసంధానం చేయమని కోరుతుంది. తప్పుడుగా డెలివరి , మిస్సింగ్ వంటి కేసుల్లో చెకింగ్ కోసం ఆధార్  వివరాలను అడుగుతోంది.  ఆధార్ కార్డు కాపీని, యూజర్లు తమ అమెజాన్ ఇన్ అకౌంట్లులో స్కాన్ చేయాలని కోరుతోంది.  ఆధార్ సమాచారమంతా సురక్షితంగా ఉంచుతామని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తాజాగా ప్యాకేజీలు కోల్పోయిన వాటిని ట్రాక్ చేసేందుకు 12 డిజిట్ యూనిట్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను తాజాగా అమెజాన్ అప్‌లోడ్ చేయమని చెబుతోంది. కేవలం అమెజాన్ మాత్రమే కాక మిగతా  ఓలా, ఇతర సంస్థలు  కూడా తమ ప్రోడక్ట్‌లకు ఆధార్‌ను జత చేస్తున్నాయి. కానీ మూడో వ్యక్తికి  ఈ వివరాలు షేర్ చేయడం  గోప్యత  సమస్యలకు దారి తీస్తాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.