అబ్బబ్బ.. ఏం వాన.. ఏం వాన..! - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బబ్బ.. ఏం వాన.. ఏం వాన..!

September 14, 2017

మామూలు వాన గాదు. వాన వడ్తుంటే ఇంట్ల కూసున్నోల్ల చెవులల్ల ‘ జుయ్..య్..య్..’ అని సప్పుడస్తున్నది. గెటర్లన్నీ పొంగి పొర్లుతున్నయి. దెబ్బకు మోర్లు గీర్లన్నీ సాపు సాపు అయిపోయినయి. మియాపూర్ మీద వానమ్మకు జర ప్రేమ ఎక్కున్నట్టున్నది. అందుకే అక్కడ పొట్టు పొట్టు వడ్డది. రోడ్ల మీద నడుం లోతు నీళ్లతోని పబ్లిక్కు బయిటికెళ్దామంటే పరేషాన్ అయితున్నరు. అపార్ట్ మెంటు సెల్లార్లల్ల అయితే కార్లు, సైకిల్ మోటర్లన్నీ మున్గి పోయినయి. అందరు మీదికెల్లి కిందికి దిగితే అంతొట్టు. పోరగాండ్ల బళ్ళు గూడ డుమ్మనే ఇగ. కూరగాయలకు, పాలకు కిందికి పోదామంటే ఆ వరద నీళ్ళల్ల యాడ ఏ మ్యాన్ హోల్ నోరు తెర్సుకొని వుంటదో అని భయమైపాయె ?

నిన్నమొన్నటిదాక అమెరికా ఫ్లోరిడాల ఇర్మా తుఫాన్ తోని అక్కడి జనాలు కింద మీదైర్రు. ఇక్కడ వానకాలం మొదలైన కాన్నుంచి అప్పుడే గర్మి అయితున్నది, అప్పుడే మొగులై దుమ్ము దుమ్ము వానలు ముసురుకుంటున్నయి. ఈ హైదరవాదుల వాన జర్రంత కొట్టినా శాన అన్పిస్తది. వూర్లల్ల ఇంతగానం కన్పియ్యది. ఎందుకంటే అక్కడ మట్టిని మూసిపెట్టే సిమెంటు రోడ్లు శాన తక్కుంటయి కాబట్టి. కుంటలు, చెరువులు, వాగులు, మత్తళ్ళు నిండితే పంటలు పచ్చగ కళకళలాడ్తయి. ఇక్కడ హైదరబాదుల ముర్కి సాపైతది, భూగర్బజలాలల్ల నీళ్ళస్తయి. ఏది ఏమైనా దమ్మువట్టి ఉర్కచ్చే అగడువడ్డ సుట్టమసుంటి వానలతోని జనాలు అతలాకుతలం అయితున్నరు ??