రెప్పపాటు కాలంలో గాల్లో ప్రాణాలు ! - MicTv.in - Telugu News
mictv telugu

రెప్పపాటు కాలంలో గాల్లో ప్రాణాలు !

March 10, 2018

హైవేల మీద రోజుకు ఎన్నో యాక్సిడెంట్లను చూస్తున్నాం. అయినా నిర్లక్ష్యంతో  రెప్పపాటు కాలంలో జీవితం మొత్తం మధ్యలోనే పూర్తి చేసుకుంటున్నాం. ఎందుకీ తొందరపాటు? ఎందుకింత ఓవర్ స్పీడ్? ఇంకా ఎంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే మనకు ప్రాణం విలువ తెలుస్తుంది?

సంగారెడ్డి దగ్గర బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదం చూస్తే  రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయంది అని అనిపించక మానదు. అయ్యో ఓ 5 సెకన్లు ఆగుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తోంది. మనం ఎన్ని అనుకున్నా నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముంబయ్ నుండి హైదరాబాద్ కు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు  అతి వేగంగా వస్తుంది. అప్పుడే రోడ్డు దాటుతున్న టిప్పర్ ను ఒక్కసారిగా ఢీ కొట్టింది. టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న డ్రైవర్ తో సహా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. బస్సు, టిప్పర్ ఢీకొన్న దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.