కాళ్లు,చేతుల కట్టేసి వరంగల్‌లో యువతిపై యాసిడ్ దాడి - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్లు,చేతుల కట్టేసి వరంగల్‌లో యువతిపై యాసిడ్ దాడి

November 29, 2017

వరంగల్‌లో దారుణం జరిగింది. ఓయువతిని ఆటోలో కిడ్నాప్ చేసి కాళ్లు చేతులూ కట్టేసి మరీ యాసిడ్ దాడికి దిగారు. మహబూబాబాద్ జిల్లా మట్టెవాడకు చెందిన యువతి వరంగల్‌లో నడుచుకుంటూ వెళుతుండగా..ఆటోలో వచ్చిన కొందరు దుండగులు, ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని

అరవుకుండా నోట్లో గుడ్డలు కుక్కి, ఆపై కాళ్లు చేతులు కట్టేసి ముఖంపై యాసిడ్ దాడి చేశారు. ఆతర్వాత రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఆమెను పడేసి పరారయ్యారు. చుట్టుపక్కలవారు ఈ దృశ్యాన్ని  గమనించి వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే యువతిపై దాడిచేసిన వాళ్లు ఎవరో తెలియాల్సి ఉంది.