శృంగారానికి ఒప్పుకోలేదని యాసిడ్ పోసిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

శృంగారానికి ఒప్పుకోలేదని యాసిడ్ పోసిన భర్త

October 31, 2017

జోజురోజుకు సమాజంలో మహిళలపై దారుణాలు ఆగటం లేవు. ఎక్కడో చోట ఎవడో మృగాడు మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య తనతో శృంగారంలో పాల్గొనలేదని ఆమె జననావయవాలపై యాసిడ్ పోశాడో శాడిస్టు భర్త. కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల కిందట వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త రాత్రి బాగా తాగొచ్చి భార్యను తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. ఆరోగ్యం బాగాలేక భార్య అందుకు ఒప్పుకోలేదు.

అంతే ఆ భర్త మిక్కిలి సైకోలా మారి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమె మర్మాంగాలపై పోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అరుపులు విన్న ఇరుగు పొరుగువారు వెంటనే వాళ్ళ అమ్మానాన్నలకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత మహిళ తండ్రి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కట్టుకున్న భార్యపైనే ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ నీఛుడిని వదిలిపెట్టకూడదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.